కాబోయే భర్తతో తొలిసారిగా ఫొటో

26 Oct, 2020 11:12 IST|Sakshi

ముంబై: అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును ఈనెల 30 పెళ్లి చేసుకుంటున్నారు. తనకు కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫొటోలను కాజల్‌ ఇప్పటివరకు షేర్‌ చేయలేదు. దీంతో వారిద్దరు కలిసి ఉన్న ఫొటో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు కాజల్‌ దసరా పర్వదినాన సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కాబోయే భర్త గౌతమ్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో కాజల్‌-గౌతమ్‌లు ఒకేరంగు దుస్తులు ధరించి ఉన్నారు. కాబోయే భర్త గౌతమ్‌ను భుజాలపై ఆనుకోని కాజల్‌ సరదాగా నవ్వుతున్న ఈ ఫొటోను చూసి నెటిజన్‌లు ‘చూడముచ్చటైన జంట’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. (చదవండి: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న కాజల్‌..!)

Happy Dussehra from us to you ! @kitchlug #kajgautkitched

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

కాజల్‌ తన పెళ్లి తేదీని ప్రకటిస్తూ.. స్నేహంతో మొదలైన తమ పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని తెలిపారు. పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగినట్లు పేర్కొంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్‌ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇకముందు కూడా తనను ఆదరిస్తారిస్తారని కాజల్‌ ఆకాక్షించారు. (చదవండి: పెళ్లి పనులు... కొత్త ఇల్లు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు