ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్‌

21 Mar, 2021 02:09 IST|Sakshi

ఓ సీక్రెట్‌ మిషన్‌ యాక్షన్‌ మిషన్‌  కోసం మార్షల్‌ ఆర్ట్స్, రైఫిల్‌ షూటింగ్, గయాక్షన్‌ మిషన్‌  ఫైరింగ్‌లో శిక్షణ పొందుతున్నారు హీరోయిన్‌  కాజల్‌ అగర్వాల్‌. నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రా (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌ పాత్రలో కనిపిస్తారు నాగ్‌. హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కూడా ఇందులో ‘రా’ ఏజెంట్‌గానే కనిపించనున్నారు. ఈ పాత్ర లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్‌  ప్రెజెన్స్‌ సూపర్‌గా ఉండాలని ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు కాజల్‌. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు కాజల్‌.

మరిన్ని వార్తలు