అదే జరిగితే సినిమాలు వదిలేస్తా: కాజల్‌ అగర్వాల్‌

20 May, 2021 08:41 IST|Sakshi

చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్‌లో టాప్‌ హీరోల నుంచి మొదలుపెడితే యంగ్‌ హీరోల వరకు అందరితోనూ కలిసి నటిస్తోంది. ఖైదీ నంబర్‌ 150లో చిరుతో స్టెప్పులేసిన ఈ భామ తాజాగా ఆచార్యలో మరోసారి మెగాస్టార్‌తో జోడీ కట్టిన విషయం తెలిసిందే. మరోవైపు కమల్‌ హాసన్‌ ఇండియన్‌ 2 సినిమాలోనూ నటిస్తోంది. నాగార్జునతో ఓ సినిమా (ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో..), తమిళంలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు ‘ఘోస్టీ’, డీకే దర్శకత్వంలో ఓ సినిమా, మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ ‘హే సినామిక’ చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.

ఇదిలా వుంటే ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్త గౌతమ్‌ కిచ్లూ యాక్టింగ్‌ వదిలేయమని చెప్తే సినిమాల నుంచి తప్పుకుంటానని వెల్లడించింది. కానీ తన భర్త, కుటుంబం నుంచి కావాల్సినంత మద్దతు ఉందని, దానివల్లే ఇప్పటికీ నటన మీద దృష్టి పెట్టగలుగుతున్నాను అని చెప్పింది. అంటే కాజల్‌ ఇండస్ట్రీలో ఎన్నాళ్లు ఉంటుందనేది ఆమె భర్త గౌతమ్‌ చేతిలో ఉందన్నమాట! 

చదవండి: New Movies Updates: పాంచ్‌ పటాకా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు