పాత్రలే దెయ్యాలైతే..!

27 Jun, 2023 01:29 IST|Sakshi

కాజల్, రెజీనా, జననీ అయ్యర్‌ ముఖ్య తారలుగా నటించిన తమిళ చిత్రం ‘కరుంగాప్పియం’. డి. కార్తికేయన్‌ (డీకే) దర్శకత్వం వహించారు. వెంకట సాయి ఫిల్మ్స్‌ పతాకంపై ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్ధన్‌ ‘కార్తీక’ పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా ముత్యాల రాందాస్, టి. జనార్ధన్‌ మాట్లాడుతూ– ‘‘జూలై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం.

ఇందులో ఐదుగురు వ్యక్తుల జీవితాలను చూపించే క్రమంలో రెజీనా లైబ్రరీలో వందేళ్ల క్రితం నాటి కాటుక బొట్టు అనే బుక్‌ చదువుతుంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పే బుక్‌ అది. అయితే అందులోని పాత్రల గురించి చదువుతున్నప్పుడు అవి దెయ్యాలుగా మారి ఆమె ముందుకు వస్తాయి. ఇక తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రను కాజల్‌ చేశారు. జనని పాత్ర కూడా అలరించే విధంగా ఉంటుంది. హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని డీకే అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు