వీరిలో అసలైన కాజల్‌‌ ఎవరబ్బా: కాజల్‌ భర్త

5 Feb, 2021 14:50 IST|Sakshi

గతేడాది అక్టోబర్‌ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. సడెన్‌గా కాజల్‌ తన ప్రేమ, పెళ్లి విషయం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేయడంతో వీరిద్దరి టాపిక్‌ కొంతకాలం వరకు టాలీవుడ్‌లో సెన్సేషనల్‌గా మారింది. పెళ్లి తర్వాత కూడా కాజల్  అగర్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే చందమామ చేతిలో.. చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ భారతీయుడుతో పాటు హిందీలో ‘ముంబాయి సాగా’ సినిమాలో నటిస్తోంది. సినిమాలతోపాటు కాజల్‌ తన వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కవగానే ప్రధాన్యతే ఇస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా భర్త గౌతమ్‌తో సమయం గడుపుతోంది. అంతేగాక ఇప్పుడిప్పుడే తన ప్రేమ మధుర జ్ఙాపకాలను బయటకు తీస్తోంది. చదవండి: స్టార్‌ హీరోయిన్ల మధ్య డిజిటల్‌ వార్‌

కాగా  సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో కాజల్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించి నేటికి ఏడాది పూర్తయ్యింది. 5 ఫిబ్రవరి 2020న కాజల్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ వేడుకకు కాజల్‌ కుటుంబసభ్యులతోపాటు గౌతమ్‌ కూడా హాజరయ్యాడు. అయితే ఆవిష్కరణ ముందురోజే గౌతమ్‌ సింగపూర్‌ చేరుకొని కొన్ని గంటలపాటు కాజల్‌తో గడిపి మరుసటి రోజు బిజినెస్‌ పని మీద జర్మని వెళ్లాడు. కానీ గౌతమ్‌ వచ్చినట్లు మీడియాకు పెద్దగా తెలియదు. తాజాగా తన భర్తతో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌చేస్తూ కాజల్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో గౌతమ్.. కాజల్, మైనపు విగ్రహం మధ్యలో నిలబడి అసలైన కాజల్‌ ఎవరని చూస్తున్నట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లా: శ్వేతాబసు ప్రసాద్‌

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

మరిన్ని వార్తలు