పెళ్ళిలో అజయ్‌ దేవ్‌గణ్‌ డబ్బులు ఆఫర్‌ చేశాడు!

24 Feb, 2021 14:00 IST|Sakshi

పెళ్ళి అనేది అందరి జీవితంలో ఒక తియ్యని అనుభూతి. బాలీవుడ్‌లో కొన్ని జంటలను చూస్తే ఒకరి కోసమే మరొకరు పుట్టారా! అనిపిస్తుంది. బీ టౌన్‌ జంట కాజోల్‌, అజయ్‌దేవ్‌గణ్‌‌ ఈ కోవలోకే వస్తుంది. వీరి పెళ్ళి జరిగి నేటితో 22 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కాజోల్‌ తమ పెళ్ళి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫోటోలో నారింజ రంగు డ్రెస్సులో ఉన్న కాజోల్‌, తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతున్న అజయ్‌ దేవ్‌గన్‌ ఒకరినొకరు చూసుకుంటున్నారు.

ఇప్పుడా ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో కాజోల్‌ తమ పెళ్ళినాటి మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. పెళ్లయి ఇన్నేళ్లవుతున్నా ఏరోజు కూడా ఒంటరిగా ఫీలవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి నాడు అజయ్‌ దేవ్‌గన్‌ ఫెరాస్‌(అగ్ని చుట్టూ తిరగడం) విషయంలో తొందర పెట్టాడని, వీలైనంత త్వరగా పెళ్ళితంతు ముగించడానికి పురొహితుడికి డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్దపడ్డాడని సరదాగా గుర్తుచేసుకున్నారు.

కాగా 1995 సంవత్సరంలో 'హల్‌చల్‌' సినిమాలో ఈ జంట తొలిసారిగా కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. పెద్దల అంగీకారంతో 1999లో​ సరిగ్గా ఇదే రోజు పంజాబీ, మహారాష్ట్ర సాంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు న్యాసా, కొడుకు యుగ్‌ ఉన్నారు. వీరిద్దరు కలిసి గుండరాజ్‌, ఇష్క్‌, దిల్‌క్యాకరే, రాజుచాచా, ప్యార్‌థోహోనాహిథా సినిమాల్లోనూ కలిసి నటించారు. ఈ మధ్యే వచ్చిన 'తానాజీ: ది అన్‌సంగ్‌‌ వారియర్‌'లోనూ భార్యాభర్తలుగా కనిపించారు.

చదవండి: మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్‌ క్వీన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు