అందం కోసం కాజోల్‌ సర్జరీ.. ట్రోల్స్‌పై హీరోయిన్‌ ఫన్నీ కౌంటర్‌

10 Feb, 2023 15:57 IST|Sakshi

అందం, అభినయంతో కట్టిపడేసిన స్టార్‌ హీరోయిన్లలో కాజోల్‌ ఒకరు. మూడు దశాబ్దాలుగా తన నటనతో అలరిస్తూ లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె అందానికి దాసోహం కానివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కానీ గత కొన్ని రోజులుగా ఆమె అందంపై కొంతమంది నెటిన్స్‌ ట్రోలింగ్‌ చేస్తున్నారు.  ఆమె పాత ఫోటోలను.. లేటెస్ట్‌ ఫోటోలను పోలుస్తూ  స్కి న్ వైటెనింగ్ సర్జరీ చేయించుందని కామెంట్‌ చేస్తున్నారు.

తాజాగా ఈ కామెంట్లపై  కాజోల్‌ ఫన్నీగా స్పందించారు.  ‘మీరు ఎలా తెల్లగా అయ్యారు? అని నన్ను అడిగే వాళ్లకు ఇదే నా సమాధానం’అంటూ ముఖం మొత్తం ముసుగు వేసుకున్న ఫోటోని షేర్‌ చేసింది.  ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.

ఈ ట్రోలింగ్‌ కంటే ముందే గతంలో కాజోల్‌ తను తెల్లగా అవ్వడం కోసం ఎలాంటి సర్జరీలు చేసుకోలేదని చెప్పింది. సినిమా షూటింగ్స్‌ కోసమని గతంలో ఎండలో ఎక్కువ సమయం గడిపానని.. అందుకే కాస్త నల్ల బడినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎండలోకి వెళ్లడం లేదని, అందుకే గతంలో కంటే తెల్లగా కనిపిస్తున్నాను.. అంతేకాని సర్జరీల వల్ల తాను రంగు మారలేదని కాజోల్‌ అన్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు