2020 నుంచి ప్రపంచ దృష్టి కోణం మారిందా?: కాజోల్‌

17 May, 2021 19:26 IST|Sakshi

బాలీవుడ్‌ నటి కాజోల్‌ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక తనకు, తన భర్త నటుడు అజయ్‌ దేవగన్‌కు సంబధించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ తనదైన శైలిలో చమత్కరిస్తుంది కాజోల్‌. తాజాగా గతేడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్‌పై స్పందిస్తూ.. 2020 నుంచి ప్రపంచ దృష్టి కోణం మారిందా అని అభిమానులను ప్రశ్నించింది. 

‘‘గతేడాది నుంచి నేను మాత్రమే ఇలా ఉ‍న్నానా?.. ప్రపంచమంతా కూడా ఇలాగే ఆలోచిస్తోందా?’’.. అంటూ మూతి ముడిచి(బుంగమూతి) ఉన్న ఫన్నీ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇక ఆమె పోస్టు చూసిన నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.. ‘అవును కరెక్ట్‌గా చెప్పారు మేడం’ అంటూ కాజోల్‌కు మద్దతు పలుకుతున్నారు. కాగా ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారితో ప్రతి అరగంటకు ఒకరు మృత్యువాత పడుతున్నారు. ఇక సినీ పరిశ్రమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొద్ది రోజులుగా ప్రతీరోజు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు కానీ, దర్శక-నిర్మాతలు కరోనాకు బలైపోతున్నారు. ఇవాళ తమిళ పరిశ్రమకు చెందిన అసురన్‌ మూవీ నటుడు నితీశ్‌ వీరాతో పాటు మరో కమెడియన్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే.

A post shared by Kajol Devgan (@kajol)

మరిన్ని వార్తలు