Kinnerasani Movie: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజవుతున్న కల్యాణ్‌ దేవ్‌ కిన్నెరసాని మూవీ

4 Jun, 2022 21:06 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు, హీరో కల్యాణ్‌ దేవ్‌ హీరోగా నటించిన చిత్రం కిన్నెరసాని. సాయి రిషిక సమర్పణలో రమణతేజ దర్శకత్వంలో రజినీ తాళ్లూరి, రవి చింతల నిర్మించారు. ఈ సినిమాను తొలుత ఓటీటీలో విడుదల చేద్దామనుకున్నాడు డైరెక్టర్‌. కానీ జీ5 వారు సినిమా చూసి అగ్రిమెంట్‌ చేసుకునే సమయంలో బిగ్‌ స్క్రీన్‌పై కూడా ఈ సినిమా బాగుంటుందని అనడంతో థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు.

జనవరి 26న థియేటర్లలో రిలీజ్‌ చేస్తామన్నారు కానీ పలు కారణాలతో వాయిదా వేశారు. అయితే కల్యాణ్‌ దేవ్‌ నటించిన సూపర్‌ మచ్చి పెద్దగా ఆడకపోవడంతో థియేటర్‌లో రిలీజ్‌ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. థ్రిల్లర్‌ మూవీ కిన్నెరసాని జూన్‌ 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించారు.

చదవండి: ఓటీటీలోకి విక్రమ్‌, రిలీజ్‌ అయ్యేది ఎప్పుడంటే?
Namita: గ్రాండ్‌గా హీరోయిన్‌ సీమంతం, ఫొటోలు వైరల్‌

మరిన్ని వార్తలు