అదిరిపోయే కొత్త లుక్‌లో ‌కల్యాణ్‌ దేవ్‌..

12 Feb, 2021 00:44 IST|Sakshi

పుట్టినరోజు సందర్భంగా కల్యాణ్‌ దేవ్‌ రెండు చిత్రాల విశేషాలను చెప్పారు. రమణతేజ దర్శకత్వంలో కల్యాణ్‌ దేవ్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కిన్నెరసాని’. రామ్‌ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్, శుభమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. గురువారం కల్యాణ్‌ దేవ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కిన్నెరసాని’ సినిమా టైటిల్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు గ్లిమ్స్‌ వీడియోను విడుదల చేశారు. దేశరాజ్‌ సాయితేజ కథ, కథనం అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్‌ మహతి సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు శ్రీధర్‌ సీపాన దర్శకత్వంలో కల్యాణ్‌ దేవ్, అవికా గోర్‌ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను కూడా కల్యాణ్‌ దేవ్‌ బర్త్‌డే సందర్భంగానే రిలీజ్‌ చేశారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. కాగా, రెండు చిత్రాల్లోనూ కల్యాణ్‌ దేవ్‌ లుక్‌ వ్యత్యాసంగా ఉంటుందని విడుదల చేసిన లుక్స్‌ చెబుతున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు