ఓటీటీలో విడుదల కానున్న మరో టాలీవుడ్‌ మూవీ!

20 May, 2021 15:51 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఓటీటీల హవా మరింత పెరిగింది.  థియేటర్లు ఇప్పట్లో తెరిచే అవకాశం లేకపోవడంతో చిన్న సినిమాలతో పాటు పెద్ద మూవీస్‌ కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. తెలుగులో ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ విడుదలై  అలరించాయి.  నాని లాంటి హీరోలు కూడా ఓటీటీవైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో టాలీవుడ్‌ సినిమా ఓటీటీ వేదికగా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ సినిమా మరెదో కాదు మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి.  పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తై చాలా కాలమే అయింది. గతేడాదిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.  ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.  త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


చదవండి:
సీక్రెట్‌గా బిగ్‌బాస్‌ షూటింగ్‌: అడ్డుకున్న పోలీసులు
డబ్బున్నోడికే సాయం: కౌంటరిచ్చిన రేణు దేశాయ్‌

మరిన్ని వార్తలు