Kalyan Ram: ట్యూషన్‌ చెప్పడానికి వచ్చి సినిమా డైలాగ్స్‌ రాశాడు

29 Jul, 2022 21:30 IST|Sakshi

నందమూరి కల్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై వశిష్ఠ్‌ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్‌ కానుంది. శుక్రవారం బింబిసార ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా హీరో కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ.. ఒక మంచి జానపద సినిమాను మీ ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నమే ఈ బింబిసార. ఈసారి మాత్రం ఎవరినీ డిసప్పాయింట్‌ చేయను. 200% మీరందరూ సంతృప్తి చెందుతారు, గర్వంగా ఫీలవుతారు. తెలుగు సినిమాకు మూలకారకుడైన తాతగారు నందమూరి తారకరామారావుగారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నా. ఈ సినిమాకు మాటలు రాసిన వాసుదేవ్‌.. మా పిల్లలకు ట్యూషన్‌ చెప్పడానికి వచ్చాడు. ఆ సమయంలో ఈ సినిమా డైలాగ్‌ రైటర్‌ అయ్యాడు. సినిమాకు ప్రాణం పోసిన వ్యక్తి కీరవాణి. బింబిసార కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చాడు.

చదవండి:  వెంట పరిగెత్తి మరీ కొట్టాను, సినిమాలో కూడా లేకుండా చేశా

మరిన్ని వార్తలు