‘ఈజిప్ట్‌ వ్యక్తితో కంగనా ప్రేమయాణం!’

19 Aug, 2021 18:35 IST|Sakshi

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌ కమల్‌ రషిద్‌ ఖాన్‌ అలియాస్‌ కేఆర్‌కే ఖాన్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె ఈజిప్ట్‌కు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉందంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో తరచూ వివాదాలతో వార్తల్లోకి నిలిచే కంగనా ఈ సారి ప్రేమ వ్యహరంతో వార్తల్లోకిక్కెంది.  కంగనా ఈజిప్టుకు చెందిన ఓ ముస్లిం వ్యక్తితో ప్రేమలో పడిందంటూ అతడితో కంగనా దిగిన ఫొటోలను షేర్‌ చేశాడు. అంతలోనే ఈ ట్వీట్‌ను డిలీట్‌ చేయడం గమనార్హం. 

దీంతో కేఆర్‌కే ఖాన్‌ కంగనాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కమల్‌ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ కంగనా లాయర్‌ రిజ్వాన్‌ సిద్ధిఖీ ఓ ట్వీట్ చేశాడు. ‘నా క్లయింట్ చిత్రాలను దురుసుగా .. దుర్మార్గంగా ఉపయోగించి ప్రతి ఒక్కరూ వదంతులు అసత్యాలను వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అంటూ కౌంట‌ర్ ఇచ్చాడు. అయితే కేఆర్కే ఈ మ‌ధ్య ప‌లువురు బాలీవుడ్ స్టార్స్‌పై త‌ప్పుడు కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమిర్‌, కిరణ్‌ రావుల విడాకుల విషయంపై స్పందిస్తూ కిరణ్‌ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇక గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చొప్రా 10 ఏళ్లలో తన భర్త నిక్‌జోనస్‌తో విడాకులు తీసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు