Kamal Haasan Health: ఆస్పత్రిలో కమల్‌ హాసన్‌, హెల్త్‌ బులెటిన్‌ విడుదల

24 Nov, 2022 16:44 IST|Sakshi

స్వల్ప అస్వస్థతకు గురైన స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ చెన్నైలోని పోరూర్‌ రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే! తాజాగా ఆస్పత్రి యాజమాన్యం కమల్‌ హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌ చేసింది. జ్వరం, దగ్గు, జలుబుతో కమల్‌ ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, ఒకటీరెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని వెల్లడించారు.

కాగా కమల్‌ హాసన్‌ గతేడాది కరోనా బారిన పడి కోరుకున్నారు. ఇండియన్‌ 2 సినిమా పనులతో బిజీగా ఉన్న ఆయన బుధవారం హైదరాబాద్‌కు వచ్చి తన గురువు కళాతపస్వి విశ్వనాథ్‌ను కలిసి వెళ్లారు. చెన్నైకి చేరుకున్న వెంటనే కాస్త అస్వస్థతకు లోనైనట్లు అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.

చదవండి: కమల్‌ హాసన్‌కు అస్వస్థత

మరిన్ని వార్తలు