‘విక్రమ్‌’ సక్సెస్‌ జోష్‌లో కమల్‌ హాసన్‌.. త్వరలోనే మరో మూవీ!

6 Jun, 2022 08:20 IST|Sakshi

‘విక్రమ్‌’ సినిమా సక్సెస్‌ జోష్‌లో ఉన్నారు కమల్‌హాసన్‌. అయితే తన తర్వాతి చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఆయన. ఈ చిత్రాన్ని ఎడిటర్, స్క్రీన్‌ప్లే రైటర్, సినిమాటోగ్రాఫర్, దర్శకుడు మహేశ్‌ నారాయణ్‌ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను జూలై చివరలో లేదా ఆగస్టు మొదటివారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు కమల్‌ అండ్‌ కో.

(చదవండి: ఓటీటీలోకి విక్రమ్‌, రిలీజ్‌ అయ్యేది ఎప్పుడంటే?)

అంతేకాదు.. ఈ మూవీకి మహేశ్‌ నారాయణ్‌తో కలిసి కో రైటర్‌గా స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా చేస్తున్నారట కమల్‌. కాగా కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’ చిత్రాలకు మహేశ్‌ నారాయణ్‌ ఎడిటర్‌గా చేశారు. మరోవైపు అన్నీ సవ్యంగా కుదిరితే... శంకర్‌ దర్శకత్వంలో తాను హీరోగా చేస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రాన్ని కూడా ఈ ఏడాదే పూర్తి చేయాలనుకుంటున్నట్లు ఇటీవల ‘విక్రమ్‌’ ప్రమోషన్స్‌లో చెప్పారు కమల్‌ హాసన్‌. 

మరిన్ని వార్తలు