Indian 2 Shooting: తిరుపతిలో భారతీయుడు

21 Jan, 2023 01:27 IST|Sakshi

హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (‘భారతీయుడు’) బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 25 సంవత్సరాల తర్వాత  ‘ఇండియన్‌’కు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ని రూపొందిస్తున్నారు. కమల్‌–శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్‌ ఇటీవల చెన్నైలో జరిగింది.

తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీశంకర్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ‘ఇండియన్‌ 2’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు