అభిమానిలో ధైర్యం నింపిన కమల్‌

25 Jun, 2021 10:28 IST|Sakshi

మనం అభిమానించే నటులు మనతో మాట్లాడితే కలిగే సంతోషమే వేరు. ఆ ఆనందాన్నే తన అభిమానికి కలిగించారు నటుడు కమలహాసన్‌. కెనడాకు చెందిన సాకేత్‌ అనే వ్యక్తి కమల్‌హాసన్‌కు వీరాభిమాని. అతను మెదడు క్యాన్సర్‌తో బాధపడుతూ మూడో స్టేజ్‌కు చేరుకున్నాడు. తన అభిమాన నటుడు కమల్‌హాసన్‌ ఒక్కసారైనా మాట్లాడాలన్న కోరికను మిత్రులకు తెలిపాడు. ఈ విషయాన్ని వారు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్‌ చేశారు.

అది కమల్‌హాసన్‌ దృష్టికి వచ్చింది. దీంతో కమల్‌ బుధవారం జూమ్‌ కాల్‌ ద్వారా కెనడాలోని సాకేత్, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అదే విధంగా క్యాన్సర్‌ వ్యాధిపై పోరాడి గెలవాలంటూ ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపారు. అందుకు ధన్యవాదాలు తెలిపిన సాకేత్‌ తను చెన్నైకి వస్తే మిమ్మల్ని కలవచ్చా? అని అడిగాడు. దీంతో కమలహాసన్‌ తప్పకుండా కలవవచ్చు అని మాట ఇచ్చారు.

చదవండి: సిగరెట్‌ కాలుస్తూ హీరో నిఖిల్‌..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు