Kamal Haasan: కమల్ హాసన్‌కు అస్వస్థత

24 Nov, 2022 08:11 IST|Sakshi

స్టార్‌ హీరో కమల్‌హాసన్‌ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంలో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని పోరూర్‌ రామచంద్ర హాస్పిటల్‌లో ఆయనను చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, డిశ్చార్‌ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. కమల్‌హాసన్‌ ఇంతకుముందు కరోనా బారిన పడ్డారు. అప్పుడు కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన ఆయన.. నిన్ననే(నవంబర్‌ 23) హైదరాబాద్‌కు వచ్చి తన గురువుగారు కళాతపస్వి కే విశ్వనాథ్‌ను కలిసి వెళ్లారు.

నిన్న రాత్రి చెన్నై చేరుకున్న తర్వాత ఆయనకు ఇలా జరిగినట్లు తెలుస్తుంది. రాత్రి కాస్త జ్వరంగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. కమల్‌ ప్రస్తుతం  ఇండియన్‌-2 లో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో షురూ కానుంది. 

మరిన్ని వార్తలు