Kamal Haasan: ఇండియన్ 2 సెట్స్‌లో కమల్.. రెండేళ్ల తర్వాత ఎంట్రీ

23 Sep, 2022 15:21 IST|Sakshi

కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో కనిపించనున్నారు. కొన్నేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించగా సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించడం, ఆ ఆతర్వాత కోర్టు కేసులతో దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో కమల్ హాసన్ సెట్స్‌లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.  

(చదవండి: Rakul Preet Singh: ‘ఇండియన్‌ 2’ సెట్‌లో అడుగుపెట్టిన రకుల్‌)

ఈ ఫోటోల్లో దర్శకుడు శంకర్, కమల్ చర్చించుకుంటున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత కమల్ సెట్స్‌లో అడుగు పెట్టడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం అందాల భామ హార్స్‌ రైడింగ్ కూడా నేర్చుకుంటోంది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మృతి చెందడంతో షూటింగ్ నిలిపేశారు. 

మరిన్ని వార్తలు