లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా: విజయ్‌కి గెస్ట్‌గా కమల్‌

22 Nov, 2022 04:27 IST|Sakshi

విజయ్‌కి కమల్‌హాసన్‌ గెస్ట్‌ కానున్నారట. కోలీవుడ్‌లో ప్రచారంలో ఉన్న వార్త ఇది. ‘మాస్టర్‌’ వంటి హిట్‌ తర్వాత విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలోనే కమల్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారని టాక్‌. కమల్‌ గత చిత్రం ‘విక్రమ్‌’కి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకుడనే విషయం తెలిసిందే.

ఈ సినిమా సూపర్‌ హిట్టయింది. మూడువందల కోట్లకు పైగా వసూలు చేసి, సంచలనం సాధించింది. ఒక సీనియర్‌ నటుడు నటించిన చిత్రం ఈ స్థాయి వసూళ్లు సాధించడం అంటే సంచలనమే కదా. అందుకే విజయ్‌ హీరోగా తాను రూపొందించనున్న తాజా చిత్రంలో గెస్ట్‌ రోల్‌ చేయమని లోకేశ్‌ కోరితే కమల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు