విందా? విధ్వంసమా?

8 Nov, 2020 01:01 IST|Sakshi

రుచికరమైన భోజనం తయారు చేస్తున్నారు కమల్‌హాసన్‌. ఓ భారీ విందుని ఏర్పాటు చేసినట్టున్నారు. అతిథులందరూ వచ్చే లోపల విస్తళ్లు సిద్ధం చేశారు. ఆహార పదార్థాలు ఉన్న గిన్నెలు కూడా. వాటితో పాటు కొన్ని కత్తులు, తుపాకులు కూడా. ఇంతకీ ఇది విందు భోజనమా? విధ్వంసం సృష్టించే ముందు విందు పెడతారా? అనేది సినిమాలో చూడాలి. ‘ఖైదీ, మాస్టర్‌’ చిత్రాల దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌ ఓ సినిమా కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. శనివారం కమల్‌హాసన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను, టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘విక్రమ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టీజర్‌లో కమల్‌ రుచికరమైన విందు వండుతూనే, విలన్స్‌ను వేసేయడానికి స్కెచ్‌ వేస్తున్నట్లుగా కనబడుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు