మార్చిలోపు ముగించేయాలి

27 Nov, 2020 06:53 IST|Sakshi

కోవిడ్‌ వల్ల సినిమా షూటింగ్స్‌ అన్నీ అటూఇటూ అయిపోయాయి. ఈ అనూహ్య గ్యాప్‌ను కవర్‌ చేయడానికి రెండు పడవల ప్రయాణం స్టార్ట్‌ చేస్తున్నారు కొందరు స్టార్స్‌. కమల్‌హాసన్‌ కూడా రెండు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేసే ప్లాన్‌ వేశారని తెలిసింది. శంకర్‌ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ సినిమా చేస్తున్నారు కమల్‌. ఈ ఇద్దరి  కాంబినేషన్‌లో 1995లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌. అలాగే యువ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో ‘విక్రమ్‌’ సినిమా కమిట్‌ అయ్యారు.

ఈ రెండు సినిమాల్లోని తన భాగం చిత్రీకరణను మార్చి లోపల పూర్తి చేయాలనుకుంటున్నారట కమల్‌. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో పూర్తిగా నిమగ్నం కావాలన్నది ఆయన ప్లాన్‌ అని సమాచారం. ‘విక్రమ్‌’ సినిమా వచ్చే వేసవిలో థియేటర్స్‌లోకి వస్తుందని ఆల్రెడీ ప్రకటించారు. ‘భారతీయుడు 2’ భారీ సినిమా కాబట్టి కమల్‌ చిత్రీకరణ పూర్తయినా ఇంకా చాలా పనులు ఉంటాయి. అందుకని ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుందని ఊహించవచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు