శృతి ప్రియుడికి థాంక్స్‌ చెప్పిన కమల్‌!

1 Mar, 2021 14:29 IST|Sakshi

చెన్నై: ‘క్రాక్‌’ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న నటి శృతిహాసన్‌ తన ప్రేమాయణంతో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. డూడుల్‌ ఆర్టిస్టు శాంతను హజారికాతో ఆమె ప్రేమలో పడినట్లు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శృతి పుట్టినరోజు నాడు శాంతను విష్‌ చేసిన తీరు, షేర్‌ చేసిన ఫొటోలు ఇందుకు మరింత ఊతమిచ్చాయి. ఇక ఇటీవల ప్రేయసితో పాటు శాంతను చెన్నై వెళ్లి ఆమె తండ్రి, విశ్వనాయకుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ చీఫ్‌ కమల్‌హాసన్‌ను కలవడంతో వీరి ప్రేమ వ్యవహారం నిజమేనని కన్‌ఫాం చేసేస్తున్నారు గాసిప్‌రాయుళ్లు.

ఇందుకు మరింత బలం చేకూర్చేలా సోషల్‌ మీడియాలో ఓ పోస్టు షేర్‌ చేశారు కమల్‌హాసన్‌. శాంతను తనకు అందించిన బహుమతి గురించి నెటిజన్లతో పంచుకున్నారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. 234 శాసనసభ స్థానాలకు ఏప్రిల్‌ 6న పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ కొత్త కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంతేగాక తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటన కూడా చేశారు. 

అదే విధంగా మార్చి 3 నుంచి ఎన్నికల ప్రచారం ఆరంభిస్తానని, 7 నుంచి విడతల వారీగా అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో టార్చ్‌లైట్‌(మక్కల్‌ నీది మయ్యం గుర్తు) పట్టుకుని ఎన్నికల సమరానికి సిద్ధమైనట్లుగా ఉన్న కమల్‌ చిత్రాన్ని శాంతను రూపొందించాడు. దీనిని షేర్‌ చేసిన కమల్‌.. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, తన శ్రమను గుర్తించినందుకు అతడికి ధన్యవాదాలు తెలిపాడు.

A post shared by Kamal Haasan (@ikamalhaasan)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు