కమల్‌హాసన్, ఫాహద్‌, సేతుపతి.. భారీ మల్టిస్టారర్‌ షూటింగ్‌ షురు

18 Nov, 2021 09:06 IST|Sakshi

చిన్న బ్రేక్‌ తర్వాత విక్రమ్‌ యాక్షన్‌ మళ్లీ షురూ అయ్యింది. కమల్‌హాసన్, ఫాహద్‌ ఫాజిల్, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విక్రమ్‌’. ఇందులో విక్రమ్‌ పాత్రలో కనిపిస్తారు కమల్‌. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ కోయంబత్తూర్‌లో మొదలైంది. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌లో కమల్‌–విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌ సీన్స్, ఫాహద్‌ సీన్స్‌ను విడి విడిగా తీశారు. తాజా షెడ్యూల్‌లో కమల్, విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ కాంబినేషన్‌లో సీన్స్‌ను షురూ చేశారు లోకేష్‌. ఇవి యాక్షన్‌ సీక్వెన్స్‌ అని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు