సింహం ఎప్పుడు సింహమే..

13 Aug, 2021 09:13 IST|Sakshi

విలక్షణమైన నటనతో భాషా భేదం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు కమల్‌హాసన్‌. చిత్ర పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టి గురువార నాటికి 62 ఏళ్లు. నాలుగేళ్ల వయసులో తమిళంలో చేసిన ‘కలత్తూర్‌ కన్నమ్మ’ చిత్రంతో కమల్‌ సినిమా కెరీర్‌ ఆరంభమైంది. 1960 ఆగస్టు 12న ఈ సినిమా విడుదలైంది. తొలి సినిమాతోనే రాష్ట్రపతి గోల్డ్‌ మెడల్‌ సాధించారు కమల్‌. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించిన కమల్‌ 1974లో ‘కన్యాకుమారి’ అనే మలయాళ చిత్రంతో హీరోగా మారారు.

ఇప్పటివరకు దక్షిణ, ఉత్తరాది భాషల్లో 231 చిత్రాల్లో నటించారు. ఇక కమల్‌ పరిశ్రమకి వచ్చి 62 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్‌’ సినిమా పోస్టర్‌ను ‘సింహం ఎప్పుడూ సింహమే’ అంటూ విడుదల చేశారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఈ నెల 20న ఆరంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు