Kamal Haasan: 400కు పైగా థియేటర్లలో విక్రమ్‌

27 May, 2022 08:15 IST|Sakshi

కమల్‌హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో హీరో సూర్య అతిథి పాత్రలో కనిపిస్తారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌పై కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 3న విడుదల కానుంది.

ఈ సినిమాను శ్రేష్ట్‌ మూవీస్‌పై నిర్మాత సుధాకర్‌ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. కాగా కమల్‌హాసన్‌ను చెన్నైలో కలిశారు సుధాకర్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘విక్రమ్‌’. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 400కు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

చదవండి 👇
లవర్స్‌తో వచ్చిన మాజీ హృతిక్‌ దంపతులు, ఫొటోలు వైరల్‌
బంపరాఫర్‌, సామాన్యులకు బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే ఛాన్స్‌

మరిన్ని వార్తలు