సంక్రాంతి బరిలో కమల్‌ సినిమా..షూటింగ్‌ షురూ

17 Jul, 2021 08:35 IST|Sakshi

కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ షూట్‌ షురూ అయింది. కార్తీ హీరోగా ‘ఖైదీ’ (2019), విజయ్‌ హీరోగా ‘మాస్టర్‌’ (2021) చిత్రాలను డైరెక్ట్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌ ఈ ‘విక్రమ్‌’ చిత్రానికి దర్శకుడు. ఇందులో కమల్‌తో పాటు విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


ఈ సినిమా షూటింగ్‌ శుక్రవారం చెన్నైలో ప్రారంభమైంది. ప్రస్తుతం కమల్‌హాసన్, విజయ్‌ సేతుపతిలపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు లొకేశ్‌. ఈ షెడ్యూల్‌ తర్వాత ఓ ఫారిన్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట. అలాగే ‘విక్రమ్‌’ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్‌ టాక్‌. మరి...‘విక్రమ్‌’ సంక్రాంతి బరిలో నిలబడతాడా? వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు