కిరణ్‌ రావు లుక్‌పై సినీ క్రిటిక్‌ కేఆర్‌కే సంచలన వ్యాఖ్యలు

9 Jul, 2021 16:10 IST|Sakshi

ప్రస్తుతం బి-టౌన్‌లో ఆమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావుల విడాకుల విషయం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమీర్‌, కిరణ్‌లు రావు తాము విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో ఆమీర్‌ దంగల్‌ నటి ఫాతిమాతో ఎఫైర్‌ కారణంగానే కిరణ్‌ రావుకు విడాకులు ఇస్తున్నాడంటూ సోషల్‌ మీడియా నెటిజన్లు సైటిరికల్‌గా ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. అంతేగాక అప్పుడు రినా దత్తాతో 15 ఏళ్లు... ఇప్పుడు కిరణ్‌ రావుతో 16 ఏళ్లు.. ఎందుకు ఇలా చేశారు ఆమీర్‌ అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సినీ క్రిటిక్‌ కమల్‌ ఆర్‌ ఖాన్‌ అలియాస్‌ కేఆర్‌కే ఆమీర్‌-కిరణ్‌ రావుల విడాలకులపై స్పందించాడు. 

ఆమీర్‌ నిజాయితీ పరుడని అందరూ అంటారు, ఆయన నిజాయితీగా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రశ్నించాడు. అంతేగాక కిరణ్‌ రావు లుక్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేఆర్‌కే తన యూట్యూబ్‌లో ఛానల్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. ఇందులో ‘ఆమీర్‌ లాంటి స్టార్‌ హీరో కిరణ్‌ రావు లాంటి సాధారణ మహిళను పెళ్లి చేసుకోవడం ఏంటని అప్పుడే అనుకున్న. ఎందుకంటే ఆయన ఓ సూపర్‌ స్టార్‌, ఆయన తలుచుకుంటే కత్రినా కైఫ్‌ వంటి అందమైన హీరోయిన్‌, ఫాతిమా సనా లాంటి వారిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ కళ్లజోడు లేకపోతే కనీసం చూడలేని, సర్వసాధారణమైన కిరణ్‌ రావును ఆమీర్‌ పెళ్లి చేసుకున్నాడని విని షాక్‌ అయ్యా. ఆమీర్‌ ఆమెనే ఎందుకు పెళ్లి చేసుకున్నాడని బాధపడ్డాను’ అంటూ వ్యాఖ్యానించాడు. 

అదే విధంగా ఆమీర్‌ డబ్బు మనిషి కాదని, ఆయన మొదటి భార్య రీనా దత్తకు విడాకులు ఇచ్చేముందు ఎలాంటి భరణం, డబ్బు చెల్లించకుండానే ఆ బంధాన్ని విడిపించుకున్నాడంటూ ఎద్దేవా చేశాడు. ‘ఇప్పడు ఆమీర్‌కు డబ్బు కొరత లేదు. ఆయన ఖచ్చితంగా కిరణ్‌ రావుకు భరణం చెల్లించాల్సిందే’ అని చెప్పుకొచ్చాడు. అంతేగాక ఇప్పుడు ఆమీర్‌ నిజాయితీగా అసలు విషయం చెప్పాలన్నాడు. కిరణ్‌ రావు కళ్లద్దాల మొహం​ చూడలేకపోతున్నానని, 15 ఏళ్లు ఆమెను చూసి చూసి బోరు కొట్టడం వల్లే విడాకులు తీసుకున్న నిజం ఒప్పుకోవాలంటూ కమల్‌ ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

మరిన్ని వార్తలు