రాజశేఖర్‌ మేనల్లుడు హీరోగా ‘కంచుకోట’

18 May, 2022 08:55 IST|Sakshi
ఆశ, రామకృష్ణ గౌడ్, దివ్య

ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ముఖ్య పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కంచుకోట’. ‘రహస్యం’ అనేది ట్యాగ్‌లైన్‌. హీరో రాజశేఖర్‌ మేనల్లుడు మదన్‌ ఈ చిత్రం ద్వారా కథానాయకునిగా పరిచయమవుతున్నారు. ఆశ, దివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎమ్‌.ఏ చౌదరి, వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు (బుధవారం) ప్రతాని రామకృష్ణ గౌడ్‌ బర్త్‌ డే సందర్భంగా ‘కంచుకోట’ టైటిల్‌ లాంచ్‌ చేశారు.

రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక హిస్టారికల్‌ సినిమా. ఇందులో నేను గురూజీ పాత్ర చేశాను. మంగ్లీ పాడిన ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్‌ పూర్తయింది. జూన్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వైస్‌ చైర్మన్‌ ఎత్తరి గురురాజ్, తెలుగు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ మోహన్‌ వడ్లపట్ల, ‘టీఎఫ్‌సీసీ’ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి. సముద్ర పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు