జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

15 Sep, 2020 13:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌లో మొదలైన విమర్శల ప్రకంపనలు తాజాగా పార్లమెంట్‌ను తాకాయి. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌పై ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ విమర్శలు ఎక్కుపెట్టారు. రాజ్యసభలో జయా మంగళవారం చేసిన ప్రసంగంపై అభ్యంతరం చెబుతూ.. మీ కుమారుడు అభిషేక్‌ బచ్చక్‌ కూడా సుశాంత్‌లా ఆత్మహత్యకు పాల్పడితే  ఇలానే మాట్లాడుతారా అంటూ నిలదీశారు. ఈ మేరకు కంగనా ఓ ట్వీట్‌ చేశారు. ’రాజ్యసభలో జయాబచ్చన్‌ మాట్లాడిన తీరు సరైనది కాదు. నాకు మాదిరిగా మీ కుమార్తె స్వేతా బచ్చన్‌ కుడా టీనేజ్‌లో వేధింపులు గురైతే  ఇలానే స్పందిస్తారా.  కొందరు వ్యక్తుల మూలంగా మానసిక ఒత్తిడి గురై సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌లా మీ కుమారుడు అభిషేక్‌ కూడా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా. మాపైన కాస్త జాలి చూపండి’ అని మండిపడ్డారు. (కొడుకు కోసమే కక్షసాధింపు)

కాగా చిత్రపరిశ్రమపై ఎంపీలు రవికిషన్‌ మాట్లాడిన తీరుపై జయా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఉంటూ డ్రగ్స్‌ మాఫీయా అంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా జయా బచ్చన్‌ రాజ్యసభలో ప్రసంగిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై కౌంటర్‌గా  కంగనా ట్వీట్‌ చేశారు. రాజ్యసభలో జీవో అవర్ సందర్భంగా బాలీవుడ్ డ్రగ్స్ కేసు అంశాన్ని లేవనెత్తారు సమాజ్‌‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్. డ్రగ్స్ పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని... సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు కూడా బాలీవుడ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.  (రవి కిషన్‌ వ్యాఖ్యలు సిగ్గు చేటు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా