నిరూపిస్తే ట్విటర్‌ నుంచి వైదొలుగుతా: కంగనా

18 Sep, 2020 11:50 IST|Sakshi

ముంబై: తాను అందరితో గొడవలు పెట్టుకుంటానని, ముందు తానే కయ్యానికి  కాలు దువ్వుతానని అందరూ అంటుంటారని, కానీ అది నిజం కాదని బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా  రనౌత్‌ అంది. ఒకవేళ అది నిజమని నిరూపిస్తే తాను ట్విట్టర్‌ నుంచి వైదొలుగుతానని ప్రకటించింది. సుశాంత్‌ ఆత్మహత్య తరువాత నుంచి బాలీవుడ్‌ నెపోటిజం మీద కంగనా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్ని నెలల నుంచి ఆమె వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది.


తాజా ఆమె ట్వీట్‌ చేస్తూ ‘నేను ముందుగా కయ్యానికి కాలు దువ్వుతానని అంటున్నారు. నేను అలా ఎప్పుడు చెయ్యలేదు. ఎవరైనా యుద్ధం మొదలు పెడితే నేను దానిని ముగిస్తాను. ఒక వేళ నేనే ఫైట్‌ మొదలు పెడతాను అని నిరూపిస్తే ట్విట్టర్‌ నుంచి తప్పుకుంటాను. నిన్ను ఎవరైనా  యుద్ధం మొదలు పెట్టమని చెబితే నువ్వు దాన్ని తిరస్కరించు అని శ్రీకృష్ణుడు  చెప్పాడు’ అని కంగనా ట్వీట్‌ చేసింది. ఇక దీంతో పాటు ఆమె ముంబాయి ఆఫీస్‌ కూల్చివేసిన ఫోటోలను  షేర్‌ చేస్తూ  నేషనల్‌ అన్‌ ఎంప్లాయిమెంట్‌ డే అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా జోడించింది.  ‘ఇది నా ఆశలను, నా కలలను, నా భవిష్యత్తును రేప్‌ చేయడమే. నా ఆఫీస్‌  ఇప్పుడు శ్మశాన వాటికలా మారింది’ అంటూ ట్వీట్‌ చేసింది.   

చదవండి: ఊర్మిళపై కంగన ఘాటు వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు