కంగనాకు ఆ విషయం చెప్పగానే సెక్యూరిటీని బయటకు పంపించేశారు: రాఘవా లారెన్స్‌

23 Sep, 2023 19:25 IST|Sakshi

చంద్రముఖి 2లో  కంగనా రనౌత్ హీరోయిన్‌ అనగానే ఆశ్చర్య పోయాను. సెట్‌లో అడుగు పెట్టగానే ఆమెకున్న సెక్యూరిటీని చూసి భయపడ్డాను. కొద్ది రోజుల తర్వాత ఆమెకు ఆ విషయం చెప్పగానే.. సెక్యూరిటీని బయటకు పంపించింది. ఆ తర్వాత చక్కగా కలిసిపోయి నటించారు. చంద్రముఖి పాత్రలో ఆమె భయపెట్టారు’అని హీరో రాఘవా లారెన్స్‌ అన్నారు. రాఘవా లారెన్స్‌, కంగనా రనౌత్‌ జంటగా నటించిన తాజా చిత్రం చంద్రముఖి-2. 17 ఏళ్ల క్రితం పీ వాసు తెరకెక్కించిన ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్‌ ఇది.  అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా లారెన్స్‌ మాట్లాడుతూ.. రజనీకాంత్‌ చేసిన రోల్‌లో నేను నటించడం  ఆ రాఘవేంద్రస్వామి నాకు ఇచ్చిన వరం.  సూప‌ర్‌స్టార్‌గారు చేసిన ఆ పాత్ర‌ను నేనెంత గొప్ప‌గా చేయ‌గ‌ల‌నా? అని ఆలోచించ‌లేదు. నా పాత్ర‌కు నేను న్యాయం చేస్తే చాల‌ని అనుకుని చాలా భ‌య‌ప‌డుతూ న‌టించాను. క‌చ్చితంగా సినిమా మీ అంద‌రినీ మెప్పిస్తుంద‌ని అనుకుంటున్నాను’ అని అన్నారు. 

కంగనా మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ మాట్లాడుతూ ‘‘నేను ఇంత‌కు ముందు ద‌క్షిణాదిలో సినిమాలు చేశాను. తెలుగులో ఏక్ నిరంజ‌న్ సినిమాలో న‌టించాను. ఇప్పుడు మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ‘చంద్రముఖి2’తో ప‌ల‌క‌రిస్తాను. వాసుగారు ఓ సారి నా ద‌గ్గరకు వ‌చ్చిన‌ప్పుడు నేను చంద్ర‌ముఖి 2లో చంద్ర‌ముఖిగా ఎవ‌రు న‌టిస్తున్నార‌ని అడిగాను. ఎవ‌రినీ తీసుకోలేద‌ని అన్నారు. నేను న‌టిస్తాన‌ని అడ‌గ్గానే ఆయ‌న వెంట‌నే ఒప్పుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాను. ‘చంద్రముఖి’లో కామెడీ, హార‌ర్ ఎలిమెంట్స్ ఎలాగైతే మిక్స్ అయ్యుంటాయో ‘చంద్రముఖి2’లోనూ అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి’ అన్నారు. 

‘చంద్ర‌ముఖి సినిమాతో ‘చంద్రముఖి2’ను లింక్ చేసి ఈ క‌థ‌ను సిద్ధం చేశాను. క‌చ్చితంగా ఆడియెన్స్‌కు సినిమాను మెప్పిస్తుంది. తెలుగులో నాగ‌వ‌ల్లి సినిమా ఉంది. అందులో డిఫ‌రెంట్ పాయింట్ ఉంటుంది. కానీ ఇందులో 17 ఏళ్ల ముందు కోట నుంచి వెళ్లి పోయిన చంద్ర‌ముఖి మ‌ళ్లీ  ఎందుకు వ‌చ్చింద‌నే పాయింట్‌తో చేశాను. తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు పీ.వాసు అన్నారు. 

మరిన్ని వార్తలు