మణికర్ణిక రిటర్న్స్‌

16 Jan, 2021 05:39 IST|Sakshi

ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా కంగనా రనౌత్‌ బాక్సాఫీస్‌ మీద కత్తి దూసిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. ఈ సినిమాకి క్రిష్‌ దర్శకుడు. అయితే కొంత భాగాన్ని డైరెక్ట్‌ చేశారు కంగన. తాజాగా ‘మణికర్ణిక’ చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటించారు. ‘మణికర్ణిక రిటర్న్స్‌: ది లెజెండ్‌ ఆఫ్‌ దిడ్డ’ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్‌ రూపొందనుంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌తో ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. కశ్మీరీ రాణి దిడ్డ కథతో ఈ సీక్వెల్‌ తెరకెక్కనుంది. కంగన టైటిల్‌ రోల్‌లో కనిపిస్తారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుంది.

మరిన్ని వార్తలు