ఆయుష్మాన్‌పై కంగ‌నా ఫైర్

10 Aug, 2020 12:06 IST|Sakshi

ముంబై : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితురాలిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రియా చ‌క్ర‌వ‌ర్తి ప‌ట్ల సానుభూతి చూపించిన న‌టుడు ఆయుష్మాన్ ఖురానాపై కంగ‌నా ఫైర్ అయ్యారు. బాలీవుడ్‌లో మ‌నుగ‌డ సాగించాల‌నే స్టార్ కిడ్స్‌కు మ‌ద్ధ‌తు ఇస్తున్నాడ‌ని ఆరోపించింది. ఆయుష్మాన్‌ను చ‌ప్లాస్‌గా అభివ‌ర్ణిస్తూ.. బాలీవుడ్ మాఫియాకు మ‌ద్ద‌తిస్తున్నావంటే ఏదో ప్ర‌యోజ‌నం పొందేందుకే అంటూ పేర్కొంది. బాలీవుడ్‌లో కంగ‌నాకు ఓ వ‌ర్గం మద్ద‌తిస్తుంటే మ‌రో వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంది. దీంతో దీన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకొని ఆయుష్మాన్ ప్ర‌యోజనం పొందేందుకు బాలీవుడ్ మాఫియాకు మ‌ద్ద‌తిస్తున్నాడ‌ని  కంగ‌నా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. (సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి ఇదే : రియా)

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంతో బీటౌన్‌లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొంద‌రు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌పై కంగ‌నౌ బాహాటంగానే విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వ‌చ్చిన ఆయుష్మాన్.. బాలీవుడ్‌లో సెల‌క్టివ్ సినిమాలు చేస్తూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నెపోటిజంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్నా ఆయుష్మాన్ మాత్రం స్టార్ కిడ్స్‌కే మ‌ద్ద‌తిస్తున్నాడంటూ కంగ‌నా ఆరోపించింది. ఇంత‌కుముందు తాప్సీ పొన్నూపై కూడా బీ- గ్రేడ్ న‌టి అంటూ ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు సుశాంత్‌కి మ‌ద్ధ‌తుగా బాలీవుడ్ ప్ర‌ముఖులెవ‌రూ మాట్లాడ‌క‌పోవ‌డంపై అతడి అభిమానులు ప్ర‌ముఖుల‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. సుశాంత్‌కి న్యాయం జ‌రిగేంత వ‌ర‌కు పోరాడ‌తామ‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున గ‌ళమెత్తుతున్నారు. (కంగనా వ్యాఖ్యలపై స్పందించిన తాప్సీ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా