కంగనా రనౌత్‌ బాడీగార్డుపై అత్యాచార కేసు!

23 May, 2021 08:12 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ బాడీగార్డ్‌ కుమార్‌ హెగ్డే మీద కేసు నమోదైంది. ప్రేమ పేరుతో అత్యాచారం చేసినందుకు అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్‌ హెగ్డే అనే వ్యక్తితో ఓ యువతికి ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని చెప్పి అతడు ఆమెతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

ఈ క్రమంలో ఏప్రిల్‌ 27న బాధితురాలి ఫ్లాట్‌కు వచ్చిన అతడు రూ.50 వేలు తీసుకుని ఉడాయించాడు. దీంతో బాధిత యువతి ముంబైలోని డీఎన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కుమార్‌ హెగ్డేను జాతీయ మీడియా కంగనా రనౌత్‌ బాడీగార్డుగా పేర్కొంది. దీన్ని పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

చదవండి: బాలీవుడ్‌లో విషాదం: లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కన్నుమూత

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు