శృంగారం అంటేనే పాపంగా చూస్తారెందుకు?

19 Nov, 2020 19:44 IST|Sakshi

‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ వ్యాఖ్యలు

మండిపడుతున్న నెటిజనులు

ముంబై: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియాలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల అధికారంగా ట్విటర్‌లో చేరినప్పటి నుంచి కంగనా నెటిజన్‌లతో మాటల యుద్దానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో ‘పెళ్లికి ముందు శృంగారం అనేది మంచి సంస్కృతి కాదని’ అంటూ చేసిన ఓ నెటిజన్‌ వ్యాఖ్యలకు కంగనా సమాధానం ఇచ్చి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘కొంతమంది స్త్రీవాదులు పెళ్లికి ముందు శృంగారం అంటేనే పాపంగా చూస్తారు. నిరాశకు గురై ఆత్మహత్య వరకు వెళ్లే స్నోఫ్లేక్స్‌ స్త్రీవాదులు సైతం వివాహేతర శృంగారాన్ని వ్యతిరేకిస్తుంటారు. అలాంటి వారంతా సహ జీవనం చేసేవారిని అంటరాని వారిగా చూస్తూ దూరంగా ఉంటారు. వారంతా దీనిని ఇష్టపడండి. పద్మశ్రీ అవార్డు గ్రహితేంటి ఇలా మాట్లాడుతుందని వారంతా అనుకోవచ్చు. కానీ స్త్రీ లైంగికతకు ఈ విక్టోరియస్‌, ఇస్లామిక్‌ విధానంతో ఏం పని?’ అంటూ కంగనా వ్యాఖ్యలు చేశారు. (చదవండి: మరో వివాదంలో కంగనా)

దీంతో నెటిజన్లు కంగనాపై విరుచుకుపడుతున్నారు. ‘పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుని, వివాహ వ్యవస్థను కించపరిచే, పెళ్లైనా వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకునే వారిని ప్రజలు అసహ్యించుకుంటారు. నువ్వు ఇది చాలా సందర్భాల్లో చేశావ్‌. ఈ లస్ట్‌ గేమ్స్‌‌ వల్ల వారి భార్య, పిల్లలు జీవితాలు ఏమౌతాయో ఆలోచించావా?’, ‘నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటున్నందుకు, ప్రజల చేత ఛీకొట్టించుకుంటున్నందు శుభాకాంక్షలు’ అంటూ నెటిజన్‌లు కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కంగనాపై మరో కేసు నమోదు..)

>
మరిన్ని వార్తలు