Kangana Ranaut: హిందీ భాష వివాదంపై కంగనా షాకింగ్‌ కామెంట్స్‌

30 Apr, 2022 16:42 IST|Sakshi

Kangana Ranaut Response On Hindi Language Controversy: కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌, బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ల మధ్య  నెలకొన్న ట్విటర్‌ వార్‌ గురించి తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదని సుదీప్‌ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో వివాదస్పదమయ్యాయి. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా.. తాజాగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ స్పందించింది. ఈ సందర్భంగా ఆమె హిందీ జాతీయ భాష కాదంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.  

చదవండి: హీరోయిన్‌ రష్మిక రోజూ ఏం తింటుందో తెలుసా?

ఆమె లేటెస్ట్‌ మూవీ ‘ధాకడ్’​ నుంచి ట్రైలర్​ను రిలీజ్​ చేశారు. ఈ ట్రైలర్​ లాంచ్​ కార్యక్రమంలో కంగనా మీడియాతో మాట్లాడుతూ హిందీ భాష వివాదంపై స్పందించింది. ‘హిందీ కంటే సంస్కృతం పాతది. సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి. అయితే, హిందీని జాతీయ భాషగా తిరస్కరించడం పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే’ అని ఆమె అభిప్రాయపడింది. అయితే మొదట మన భాష, మూలాలు, సంస్కృతి గురించి గర్వపడే హక్కు మనందరికీ ఉందని వ్యాఖ్యానించింది. 

చదవండి: ‘ఆచార్య’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..

ఈ మేరకు ఆమె ‘మన దేశం సాంస్కృతికంగా, భాషల వారీగా చాలా వైవిధ్యమైనది. కాబట్టి వాటిని తీసుకురావడానికి మనకు ఒక ఉమ్మడి భాష అవసరం. భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు హిందీని జాతీయ భాషగా చేశారు. నిజానికి హిందీ కంటే తమిళం పాత భాష. కానీ పురాతనమైనది సంస్కృత భాష. కాబట్టి, నా అభిప్రాయం ప్రకారం, సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి కానీ హిందీ కాదు’ అని కంగనా వివరణ ఇచ్చింది. అనంతరం హిందీని జాతీయ భాషగా ఎందుకు ఎంచుకున్నారనేదానికి తన దగ్గర సమాధానం లేదని, కానీ ఇప్పుడు దానిని పాటించకపోతే రాజ్యాంగాన్ని తిరస్కరించినట్లవుతుందని కంగనా పేర్కొంది. 

మరిన్ని వార్తలు