కంగనా సవాల్‌.. నా కంటే గొప్ప నటిని చూపించగలరా?

9 Feb, 2021 20:46 IST|Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తన అహంకారమైన తీరుతో తరచూ వివాదంలో చిక్కుకుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం కంగనా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కంగనా జయలలిత బయోపిక్‌ ‘తలైవి’, యాక్షన్‌ మూవీ ‘థాకడ్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల షూటింగ్‌ షెడ్యూల్‌ చివరి దశకు చేరుకుని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ రెండు చిత్రాల పోస్టర్‌లను షేర్‌ చేస్తూ తనని తాను హాలీవుడ్‌ స్టార్‌ నటి మెర్లీ స్ట్రీప్‌, ఇజ్రాయిల్‌ బ్యూటీ.. గాల్‌ గాడోట్‌లతో పోల్చుకున్నారు. అంతేగాక తనకంటే గోప్ప నటి ఎక్కడ లేదంటూ మిగత నటీనటులకు సవాలు విసిరారు. చదవండి : (తనకున్న వ్యాధి గురించి చెప్పిన కాజల్‌)

కాగా కంగనా తన ట్వీట్‌లో ‘భారీ పరివర్తనానికి హెచ్చరిక... ఇంతటి స్థాయిలో నేను చూపించే నటనను మరే ఏ నటి చూపించలేదు. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన మెర్లీ స్ట్రీప్‌లో ఉండే టాలెంట్‌ నాలో ఉంది. అలాగే ప్రముఖ ఇజ్రాయిల్‌ నటి గాల్ గాడోట్‌లా యాక్షన్‌తో పాటు, గ్లామర్‌గా కనిపించగలను’ అంటూ కంగనా తన గర్వాన్ని చూపించారు. అంతేగాక మరో ట్వీట్‌లో ‘నాలా అద్భుతమైన నటన కనబరిచే మరో నటి ఈ భూమ్మీద ఉందని చూపించగలరా?, అయితే నేను వాదించేందుకు సిద్దం. ఒకవేళ నిజంగానే ఉందని నిరూపిస్తే నా గర్వాన్ని, ఆహంకారాన్నివదులుకుంటానని మాటిస్తున్న.అయితే అప్పటి వరకు ఖచ్చితమైన నా ఆహంకారాన్ని చూడండి’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఇక కంగనా ట్వీట్‌కు నెటిజన్‌లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  ‘దేవుడు మీకు అన్నిఇచ్చాడు. పరిధికి మించి టాలెంట్‌, అద్భుతమైన నటన నైపుణ్యం.. కానీ వినయం మాత్రం ఇవ్వలేదు’ , ‘ఒకవేళ మెరిల్‌ స్ట్రీవ్‌కు మీ గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆమె మీపై పరువు నష్టం దావా వేస్తుంది’, ‘ఇక ఇంగ్లీష్‌ డిక్షనరీలో ఈ కొత్త పదాన్ని చేర్చాలి.. కంగనైజం(భ్రమతో బాధపడే వ్యక్తి) అంటూ నెటిజన్‌లు కంగనాకు చురకలు అంటిస్తున్నారు. 

చదవండి : (‘హీరోయిన్‌ అవ్వాలని రాలేదు.. సల్మాన్‌ కోసమే వచ్చాను’)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు