ఆస్కార్‌కు ‘జల్లికట్టు’.. కంగన స్పందన

26 Nov, 2020 16:05 IST|Sakshi

బాలీవుడ్‌ మాఫియాకు చెక్‌ 

ముంబై: ఆస్కార్‌ అవార్డుకు మన దేశం నుంచి మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ను ఎంపిక చేయడాన్ని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ స్వాగతించారు. ‘జల్లికట్టు’ టీమ్‌ను ఆమె అభినందించారు. 93వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మన దేశం తరపున ‘జల్లికట్టు’ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ మాఫియా చెక్‌ పెట్టి, ఆస్కార్‌ పోటీకి మంచి సినిమాను ఎంపిక చేశారని బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగన పేర్కొన్నారు. పనిలో పనిగా బాలీవుడ్‌ మాఫియాపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ నాలుగు కుటుంబాలకే పరిమితం కాదని, మూవీ మాఫియా గ్యాంగ్‌ను కాదని మంచి సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేశారని ట్వీట్‌ చేశారు. 

కంగన ఆరోపణలు చిత్ర సీమకే పరిమితం కాలేదు. ఒక వైపు బాలీవుడ్‌ పెద్దలను మరోవైపు రాజకీయ ప్రముఖలను టార్గెట్‌ చేస్తూ ఎప్పుడు వార్తలలో నిలుస్తోంది. గత నెలలో కంగన, మహరాష్ట్ర ముఖ్య మంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మధ్య మాటల యుద్ధం కోటలు దాటింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ఫుత్‌ అనుమానాస్పద మృతి కేసు విషయమై ముంబై నగరాన్ని పీవోకేతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా  ఉద్ధవ్‌ ఠాక్రే.. కంగనపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ మాటల యుద్ధం కొనసాగుతుండగానే మరోసారి బాలీవుడ్‌ మాఫియాను ఎండగట్టింది కంగన.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా