జాతిపితపై కంగనా సంచలన వ్యాఖ్యలు

12 Mar, 2021 20:36 IST|Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంటుంది. సినీ, రాజకీయ ప్రముఖులపై ఆసభ్య వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. రైతుల నిరసనను వ్యతిరేకిస్తూ కంగనా చేసిన ట్వీట్లు వివాస్పదం కావడంతో ఆమెపై కేసు కూడా నమోదైంది. దీనిపై ఆమె కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా కంగనా జాతిపితను టార్గెట్‌ చేసింది. మహాత్మాగాంధీని విమర్శిస్తూ ట్విటర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. గాంధీ తన భార్య, బిడ్డలను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయంటూ శుక్రవారం ట్వీట్‌ చేసింది.

‘జాతిపిత తన సొంత బిడ్డలను వేధించి చెడ్డ తండ్రిగా పేరుతెచ్చుకున్నారు. తన భార్య అతిధుల మరుగుదొడ్లు శుభ్రం చేయలేదని ఆమెను ఇంటి నుంచి బయటకు నెట్టివేసినట్లు పలు ప్రస్తావనలు ఉన్నాయి. అయినప్పటికి గాంధీజీ జాతిపిత అయ్యారు. ఆయన మంచి భర్త, తండ్రి కాకపోయిన ఒక గొప్ప నాయకుడు అయ్యారు. అది కేవలం పురుషాధిక్యత వల్లే సాధ్యమైంది’ అంటూ కంగనా ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఇది వరకు కంగనా సాధారణ వ్యక్తులను సినీ, రాజకీయ ప్రముఖలను మాత్రమే టార్గెట్‌ చేయడంతో అంతా ఆమె తీరు ఇంతెనంటూ ఉరుకునేవారు. కానీ ఈసారి గాంధీపై ఆమె విమర్శ వ్యాఖ్యలు చేయడంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు కంగనాపై మండిపడుతున్నారు. కంగనా మితిమీరి ప్రవర్తిస్తోందని, ఇలాగే వదిలేస్తే ఆమె మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: 
‘అలా అయితే కంగనా కూడా సిగ్గుపడాలి’

మంచు విష్ణుకు విశాఖ ఉక్కు సెగ 
‘సీఎం సాబ్‌... నాకు పెళ్లి కూతుర్ని చూడండి’  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు