ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడకండి: కంగనా

6 Jan, 2021 12:56 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముంబైని పాక్‌ అక్రమిత కశ్మీర్‌గా పేర్కొనడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే, కంగనాలు ఒకరిపై ఒకరు విరుచకుపడుతూ మాటల యుద్ధానికి దిగారు. ఈ నేపథ్యంలో కంగనా పలువురు ప్రముఖులపై అనుహ్య వ్యాఖ్యలు చేస్తూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా ఆమె మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత, హీరో కమల్‌ హాసన్‌పై విరుచుకుపడ్డారు. కాగా త్వరలో రాబోయే తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ప్రచారంలో మునిగిపోయారు. ఈ క్రమంలో కమల్‌ హాసన్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. (చదవండి: తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి)

దీంతో కంగనా, కమల్‌ ఆలోచనను తప్పుబడుతూ మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడకండి. మాతృత్వం కోసం అమితంగా ప్రేమించే వారితో శృంగరానికి వెల కట్టడం కరెక్ట్‌ కాదు. ఓ భార్యగా, తల్లిగా ఇంట్లో పనిచేయడం మహిళల హక్కు దానికి మీరు వెల కట్టకండి. ఇంటి యజమానురాలైన మహిళను తన సొంతింటిలోనే ఉద్యోగిగా మార్చకండి. మాకు కావాల్సింది వేతనం కాదు.. సమాజంలో గౌరవం, ప్రేమ. భగవంతుడి సృష్టికి డబ్బులు చెల్లించాలనుకుంటున్న మీ ఆలోచనను మార్చుకోండి’ అంటూ కంగనా మండిపడ్డారు. అయితే కమల్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ ఎంపీ శిశీథరూర్ సమర్థించారు. ఆయన ఆలోచన తీరు ప్రశంసనీయమని థరూర్‌ ఆయనను కోనియాడారు. (చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై!)

మరిన్ని వార్తలు