Dhaakad Movie: నాలుగు భాషల్లో ఫైరింగ్​ చేయనున్న ఫైర్​బ్రాండ్​ కంగనా

28 Feb, 2022 16:47 IST|Sakshi

Kangana Ranaut Dhaakad Movie Release In Four Languages: బాలీవుడ్ ఫైర్​బ్రాండ్, డేరింగ్​ హీరోయిన్​ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్​ మీడియాలో కామెంట్స్​ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్​గా రికార్డుకెక్కింది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి భయం లేకుండా బయటకు చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. సామాజిక అంశాలపై మాట్లాడటమే కాకుండా సినిమాలతో కూడా ఫుల్​ బిజీగా ఉంటుంది. కంగనా నటించే సినిమాలు ఎక్కువగానే ప్రేక్షదారణ పొందుతాయి. గతకొంతకాలంగా దక్షిణాది భాషల్లోనూ కంగనా చిత్రాలు అనువాదమవుతున్నాయి. తాజాగా కంగనా నటించిన మూవీ 'ధాకడ్'​.

ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్​ కానుంది. మనుషుల అక్రమ రవాణా నేపథ్యంలో యాక్షన్​ థ్రిల్లర్​ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనా ఏజెంట్​ అగ్ని పాత్రలో అలరించనుంది. నిజానికి ఈ సినిమా గతేడాది అక్టోబర్​ 1న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్​ ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని మే 27న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్​ చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా తెలుపుతూ కంగనా ఈ సినిమాలోని ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో శత్రువులపై ఫైరింగ్​ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెన్సివ్​ లుక్​లో కంగనా స్టిల్​ ఉంది. ఈ సినిమాలో నెగెటివ్​ రోల్​లో అర్జున్​ రాంపాల్​ నటిస్తుండగా దివ్యా దత్తా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ​
 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

మరిన్ని వార్తలు