వై ప్లస్‌ సెక్యూర్టీ!

8 Sep, 2020 02:14 IST|Sakshi

‘‘ప్రస్తుతం ముంబై పరిస్థితి కాశ్మీర్‌ను తలపిస్తోంది’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఆయితే ఆ కామెంట్లు పలువురు మహరాష్ట్ర నేతలకు రుచించలేదు. కంగనాను ముంబైలో అడుగుపెట్టనివ్వం అన్ని సవాళ్లు విసిరారు. లాక్‌డౌన్‌లో వచ్చిన బ్రేక్‌ కారణంగా తన సొంతూరు భంభ్లాలో ఉంటున్నారు కంగనా. హిమాచల్‌ ప్రదేశ్‌లోని చిన్న పట్టణం ఇది. ‘‘సెప్టెంబర్‌ 9న ముంబై వస్తున్నా’’ అని ప్రకటించారు కంగనా.

ఆమెకు భద్రత కల్పించాల్సిందిగా కంగనా సోదరి రంగోలి, ఆమె తండ్రి ప్రభుత్వాన్ని కోరారట. దాంతో ఆమె హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నప్పుడే కాదు.. ముంబైలోనూ సెక్యూర్టీ కల్పిస్తామని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రికమండ్‌ చేసిన మేరకే కేంద్ర ప్రభుత్వం వై ప్లస్‌ కేటగిరీ సెక్యూర్టీ అందించడానికి సిద్ధమవుతోందని సమాచారం. 9న ముంబై చేరుకున్నప్పటి నుంచి కంగనాకి కేంద్ర ప్రభుత్వం ఈ భద్రత కల్పించనుందట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు