బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ఇల్లు చూసేద్దామా?

15 Apr, 2021 15:24 IST|Sakshi

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌కు హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో ఓ ఇల్లు ఉన్న విషయం తెలిసిందే కదా! 30 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్న ఆమె అందులో సకల సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. 7 బెడ్‌రూంలు, 7 బాత్రూమ్‌లతో పాటు విశాలమైన హాల్‌ ఉన్న ఆ ఇంటి అద్దాల కిటికీలో నుంచి బయటకు చూస్తే హిమాలయాలు దగ్గరగా కనిపిస్తాయి.

2017లో ఇంటీరియర్‌ డిజైనర్‌ శబ్నం గుప్తా కంగనా ఇంటి బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. గృహంలోని ప్రతి భాగాన్ని కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుని నిర్మాణం చేపట్టాడు. ఈ ఇంద్రభవనంలోకి కంగనా 2018లో గృహప్రవేశం చేసింది. ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట గింగిరాలు తిరుగుతున్నాయి. ఈ సందర్భంగా కంగనా ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం..

ఇంటికి సమీపంలో పర్వతాలు కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వర్క్‌ షెడ్యూల్‌ నుంచి ఫ్రీ అవగానే తన అలసట హుష్‌ కాకి అయ్యేలా బెడ్‌రూమ్‌ను డిజైన్‌ చేశారు. హిమాలయాలను మంచు కప్పినట్లుగా ఈ బెడ్‌రూమ్‌లో తెలుపు రంగు డామినేషన్‌ స్పష్టంగా కనిపిస్తుంది.

గోడల మీద స్వహస్తాలతో వేసిన పెయిటింగ్‌లు చూడముచ్చటగా కనిపిస్తాయి. అలాగే ఇంటి లోపల నుంచి ఉన్న మెట్లు కూడా ఏదో సాదాసీదాగా కాకుండా గ్రాండ్‌గా ఏర్పాటు చేయించారు. కంగనా ఎక్కువగా ఎక్కడికి షికారుకు వెళుతుందో ఆ ఏరియాకు సంబంధించిన ఫొటోలు గోడల మీద దర్శనమిస్తాయి.

లివింగ్‌ రూమ్‌లో పుస్తకాలు నిండిన షెల్ఫ్‌లు దర్శనమిస్తాయి. ఏదైనా ఊసుపోనప్పుడు లేదా సాయంత్రం వేళ టీ తాగుతూ బుక్‌ చదువుకోవాలన్నా ఇదే పర్ఫెక్ట్‌ ప్లేస్‌. 

లివింగ్‌ రూం గుండా నడుచుకుంటూ వెళ్తే ఓ అద్దాల గది కనిపిస్తుంది. ఇందులో గోడలు, పై కప్పు అంతా అద్దాలమయమై ఉంటుంది. ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. లివింగ్‌ రూమ్‌కు మరో పక్క ఆనుకుని ఉండేది బార్‌ గది. ఇందులో లైటింగ్‌ బాగుంటుంది.

చదవండి: మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్‌ క్వీన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు