అమీర్‌, అనుష్క‌ ఎందుకు నోరు విప్ప‌లేదు?

20 Aug, 2020 11:45 IST|Sakshi

బాలీవుడ్ సంచ‌ల‌న హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ మ‌రోసారి బాలీవుడ్ స్టార్ల‌పై మండిప‌డ్డారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును ఆమె ప్ర‌స్తావిస్తూ.. సుశాంత్‌తో క‌లిసి న‌టించిన వాళ్లు దీనిపై ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. హీరో అమీర్ ఖాన్‌, హీరోయిన్ అనుష్క శ‌ర్మ.. సుశాంత్‌తో కలిసి 'పీకే' చిత్రంలో ప‌ని చేశార‌ని తెలిపారు. ఈ ఇద్ద‌రూ సుశాంత్‌కు న్యాయం జ‌ర‌గాల‌నో లేదా సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌నో ఎందుకు డిమాండ్ చేయ‌లేద‌ని నిల‌దీశారు. వీళ్లే కాకుండా పీకే సినిమా ద‌ర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, సుశాంత్ సినిమాలను తెర‌కెక్కించిన నిర్మాత ఆదిత్య చోప్రా, రాణి ముఖ‌ర్జీల‌పై కూడా ఆమె అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వీళ్లంద‌రినీ బాలీవుడ్ రాకెట్ ముఠాగా ప‌రిగ‌ణించారు. (ట‌ర్కీ ప్రథమ మ‌హిళ‌తో ఆమిర్.. నెటిజన్ల ఫైర్‌)

ఒక్క‌రు సైలెంట్‌గా ఉన్నా అంద‌రూ అదే ఫాలో అవుతారు
"ఈ రాకెట్ ఎలా ప‌ని చేస్తుందో తెలుసా? ఒక్క‌‌రు నోరు విప్ప‌క‌పోయినా మిగ‌తా అంద‌రూ మౌనంగా ఉంటారు. అలా.. ఎవ‌రూ సీబీఐ ద‌ర్యాప్తు జ‌ర‌గాల్సిందేన‌ని డిమాండ్ చేయ‌డానికి ముందు రాలేదు. ఇదెలా ఉంటుందంటే.. అమీర్ ఖాన్ ఏమీ మాట్లాడ‌లేద‌నుకో, అనుష్క కూడా నాకెందుకొచ్చిందిలే అని సైలెంట్‌గా ఉంటారు. అలానే రాజ్‌కుమార్ హిరానీ, ఆదిత్య చోప్రా, అత‌ని భార్య రాణి ముఖ‌ర్జీ కూడా నోరు మెద‌ప‌రు. వీళ్ల‌దంతా ఓ గ్యాంగ్" అని కంగ‌నా మండిప‌డ్డారు. (అమిర్ నాకు పెట్ట‌కుండానే తిన్నారు: దీపిక‌)

మీకు మాట‌లే క‌రువ‌య్యాయా?
"మీకు ఎక్క‌డో చోట త‌ప్పు చేశామ‌న్న అప‌రాధ భావ‌న లేక‌పోతే మీ స‌హ‌న‌టుడు, ఇండ‌స్ట్రీలోని ముఖ్య వ్య‌క్తి సుశాంత్ మ‌ర‌ణంపై ఎందుకు స్పందించ‌ట్లేదు? అంటే మీకు ఈగ‌నో, దోమ‌నో చ‌నిపోయిన‌ట్లు అనిపిస్తుందా? అత‌ని కోసం చెప్పేందుకు మీకు మాట‌లే క‌రువ‌య్యాయా? అక్క‌డ అత‌ని కుటుంబం రోదిస్తోంది. క‌నీసం వారి ప‌ట్ల మీరు సానుభూతి కూడా చూపించ‌లేరా? సీబీఐ ద‌ర్యాప్తు చేయాల్సిందేన‌ని గొంతెత్తి ప్ర‌శ్నించ‌లేరా? ఇందులో మీరు ఏ ఒక్క‌టీ చేయ‌లేదు, ఎందుకు? ఎందుక‌ని ఇంతలా భ‌య‌ప‌డుతున్నారు? జ‌రుగుతున్న ప‌రిణామాల‌న్నింటినీ దేశమంతా చూస్తోంది" అని ఆమె పేర్కొన్నారు. కాగా సుప్రీం కోర్టు సుశాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని కంగ‌నా మొద‌టి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అనంత‌రం ఇదే డిమాండ్ అంత‌టా వినిపించ‌డంతో ఎట్ట‌కేల‌కు సుప్రీం కోర్టు సీబీఐ ద‌ర్యాప్తుకు అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. (సుశాంత్‌ కేసు సీబీఐకే)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు