శివసేన ఎంపీపై రెచ్చిపోయిన కంగనా

7 Sep, 2020 10:48 IST|Sakshi

ముంబై: తనపై విమర్శలు చేస్తున్నవారిపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ పురుష అహంకారి అని విమర్శించారు. భారతీయ మహిళలపై ఇన్న ఘోరాలు, అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమేనని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మహారాష్ట్రవాసిని కాదన్న సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని అన్నారు. గతంలో ముంబై మహా నగరంలో బతకలేకపోతున్నామని చెప్పిన ఆమిర్‌ ఖాన్‌, నసీరుద్దీన్‌ షాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా ప్రశ్నించారు. ఒక మహిళను అయినందునే శివసేన ఎంపీ రెచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కంగనా ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు. 
(చదవండి: నేను విఫలమయ్యాను: సుశాంత్‌ సోదరి)

సెప్టెంబర్‌ 9 న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని ఆమె విమర్శకులకు సవాల్‌ విసిరారు. ప్రస్తుతం ఆమె సిమ్లాలోని తన సొంతింట్లో ఉన్నారు. కాగా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. మంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడకు రావొద్దని సంజయ్‌ రౌత్‌ కంగనాకు కౌంటర్‌ ఇచ్చారు. ఎంపీ సంజయ్‌ బహిరంగంగా తనకు వార్నింగ్‌ ఇస్తున్నారని, ఇప్పడు తనకు ముంబై పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని కంగనా కామెంట్‌ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో కంగనాకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.
(చదవండి:కంగనా కామెంట్లు; అందుకు నేను సిద్ధం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా