ఆ హీరోతో ప్రియాంక క్లోజ్‌గా ఉండటం కరణ్‌ తట్టుకోలేకపోయాడు..కంగన సంచలన ఆరోపణలు

29 Mar, 2023 11:18 IST|Sakshi

ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌పై బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సంచలన ఆరోపణలు చేసింది.  హీరోయిన్‌ ప్రియాంక చోప్రాను కరణ్‌ మానసికంగా వేధించాడని, అందుకే ఆమె బాలీవుడ్‌ను వదిలి వెళ్లిందని చెప్పింది. తాను బాలీవుడ్‌కు దూరం కావడంపై తాజాగా ప్రియాంక చోప్రా స్పందించిన విషయం తెలిసిందే. ఓ అమెరికన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువని, వాటిని తట్టుకోలేకనే హాలీవుడ్‌కి వచ్చేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. దీనిపై కంగనా ట్విటర్‌ వేదికగా స్పందించింది.

‘బాలీవుడ్‌లో కొందరు గ్యాంగ్‌గా మారి ప్రియాంకను అవమానించారు. స్వయం కృషితో ఎదిగిన మహిళను భారత్‌ వదిలి వెళ్లిపోయేలా చేశారు. కరణ్‌ జోహార్‌ ఆమెను బ్యాన్‌ చేశారనే విషయం అందరికి తెలుసు. షారుఖ్‌ ఖాన్‌తో ప్రియాంక ఫ్రెండ్‌షిప్‌ చేయడం కరణ్‌కు నచ్చలేదు. అందుకే ఆమెను దూరం పెట్టాడు.

ఈ విషయంపై అప్పట్లో మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. సినీ పరిశ్రమ వాతావరణాన్ని నాశనం చేసినందుకు కరణ్‌ బాధ్యత వహించాలి. అమితాబ్‌, షారుఖ్‌ వంటి వారు సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవు’అని కంగనా వరుస ట్వీట్స్‌ చేసింది. 

మరిన్ని వార్తలు