బాలీవుడ్‌ ప్రముఖులపై కంగనా సంచలన వ్యాఖ్యలు

26 Aug, 2020 18:20 IST|Sakshi

‘రక్త పరీక్షలు నిర్వహిస్తే వారంతా జైలుకే’

ముంబై : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు దర్యాప్తులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఎంట్రీపై ఫైర్‌బ్రాండ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ స్పందించారు. డ్రగ్‌ ముఠాలతో బాలీవుడ్‌ సంబంధాలపై ఎన్‌సీబీ దర్యాప్తు చేపడితే పలువురు ప్రముఖులు జైలుకు వెళతారని కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో బాలీవుడ్‌లో ప్రవేశిస్తే..పలువురు ప్రముఖులు (ఏ లిస్టర్స్‌) జైలు ఊచలు లెక్కబెడతారు..బాలీవుడ్‌ జనాలకు రక్త పరీక్షలు నిర్వహిస్తే దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూస్తాయ’ని కంగనా ట్వీట్‌ చేశారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద ప్రధానమంత్రి కార్యాలయం బాలీవుడ్‌ అనే బురదను ప్రక్షాళన చేస్తుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

ఇక రియా చక్రవర్తి వాట్సాప్‌ చాట్స్‌లో 2017 నుంచి 2019 మధ్య హార్డ్‌ డ్రగ్స్‌, ఎండీఎంఏపై చర్చ జరిగినట్టు గుర్తించిన ఈడీ ఈ విషయాన్ని సీబీఐ, ఎన్‌సీబీలకు నివేదించిన నేపథ్యంలో కంగనా ట్వీట్‌లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రియాకు డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన సంభాణలను ఈడీ అధికారులు సీబీఐ అధికారులతో పంచుకున్నారు. సుశాంత్‌ మృతి కేసు విచారణలోకి ఎంటరైన ఎన్‌సీబీ ఇప్పటికే పలు పత్రాలను పరిశీలించిందని ఎన్‌సీబీ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్తానా వెల్లడించారు. రియా, సుశాంత్‌లకు డ్రగ్‌ సరఫరా జరిగినట్టు తాము చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందని ఈడీ నుంచి తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. దీనిపై ఎన్‌సీబీ బృందం దర్యాప్తు చేపట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నిస్తుందని చెప్పారు. మరోవైపు సుశాంత్‌ మృతికి సంబంధించి ముంబై పోలీసుల దర్యాప్తులో సీబీఐ కొన్ని విధానపరమైన లోపాలను గుర్తించింది. చదవండి : బాయ్‌కాట్‌ కంగనా!

>
మరిన్ని వార్తలు