‘శ్రీదేవి తరువాత ఆ ఘనత నాకే సాధ్యం’

25 Feb, 2021 16:42 IST|Sakshi

ముంబై : అతిలోక సుందరి, అందాల తార శ్రీదేవి తరువాత సినిమాల్లో కామెడీ పాత్రలు చేయగలిగిన సత్తా తనదేనని బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ అన్నారు. కంగనా నటించిన ‘తను వెడ్స్‌ మను’ సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి25) 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా నటనలో కొత్త మార్గాలను చూపించిందని పేర్కొన్నారు. 2011లో విడుదలైన ఈ చిత్రానికి అనంతరం 2015లో సిక్వెల్‌ రూపొందించారు. ఇందులో కంగనా ద్విపాత్రాభినయం పోషించారు. సినిమా పదేళ్లు పూర్తయిన సందర్భంగా కంగనా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

‘తను వెడ్స్‌ మను’ ముందు వరకు ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించాను. కానీ ఈ చిత్రం నా కెరీర్‌ను మరో విధంగా మార్చింది. ఇందులో కామెడీతో మెయిన్‌ లీడ్‌ చేశాను. నా కామెడీ టైమింగ్‌ కూడా చక్కగా కుదిరింది. దీంతో లెజండరీ నటి శ్రీదేవి తర్వాత ఆ లెవల్లో కామెడీ చేసిన నటిని నేనే. అని ట్వీట్‌ చేశారు. అదే విధంగా సినిమా దర్శకుడు, రచయితకు ధన్యవాదాలు తెలిపారు. ‘తను వెడ్స్‌ మను మేకర్స్‌ కెరీర్‌లను మార్చుతుందని అనుకున్నా. కానీ దానికి బదులు నా కెరీర్‌ను మార్చేసింది. అందుకే ఏ చిత్రం విజయం సాధింస్తుందో ఏది కాదో ఎవరూ చెప్పలేరు. అంతా విధిరాత. నా తలరాత బాగుంది’ అన్నారు.
చదవండి: భజన వీడియోకు ముగ్ధురాలైన కంగనా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు