నా మరదల్ని చూస్తే అమ్మ గుర్తుకొస్తోంది: కంగన

18 Dec, 2020 20:11 IST|Sakshi

ముంబై: ‘‘ఆహా.. ఇప్పుడే నాకు ఈ వీడియో పంపించారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న నా మరదలు.. మక్కీ కీ రోటీ(మక్క రొట్టె) తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తను ఒక డాక్టర్‌. స్వతంత్ర మహిళ. అయినా తన మూలాలు మరచిపోలేదు. తనను చూస్తుంటే మా అమ్మ గుర్తుకువస్తోంది. ఆనంద భాష్పాలు’’  అంటూ బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ తన తమ్ముడి భార్యపై ప్రశంసలు కురిపించారు. ఆమె తమ కుటుంబంలోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాగా సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందించే కంగన ఫైర్‌బ్రాండ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: నేనేమీ తనను బలవంతపెట్టలేదు: సనా భర్త)

ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండే ఆమె.. అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను కూడా ఫాలోవర్లతో పంచుకుంటారు. కాగా కంగన సోదరుడు అక్షత్‌ రనౌత్‌కు నవంబరులో రీతూ అనే యువతితో వివాహం జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ప్రీవెడ్డింగ్‌ వేడుకలు మొదలైన నాటి నుంచి కుటుంబంతో చేరిన కంగన.. తన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ప్రతీ జ్ఞాపకాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. హల్దీ, మెహందీ, సంగీత్‌లతో తాను ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలు పంచుకున్నారు.

ref="https://t.co/cfySO9Ekpu">pic.twitter.com/cfySO9Ekpu

— Kangana Ranaut (@KanganaTeam) December 18, 2020

మరిన్ని వార్తలు